// tawk
Loading...
ప్రకటన
తెలంగాణ స్టేట్ బిల్డింగ్ పర్మిట్ అండ్ సెల్ఫ్ సర్టిఫికేషన్ సిస్టమ్

తెలంగాణ రాష్ట్రం – బి పాస్

పట్టణ మరియు దేశ ప్రణాళికా రూపకల్పన డైరెక్టరేట్ కి స్వాగతం

భారత రాజ్యాంగపు IX-ఏ భాగం రూపంలో దానికి సంబంధించిన లేదా వాటి పరిణామంగా ఏర్పడే వ్యవహారాలకు గాను తెలంగాణా రాష్ట్రంలోని హైదరాబాద్ మహానగరపాలక సంస్థ కాకుండా మిగిలిన మునిసిపాలిటీలను ఏకీకృతం చేయడానికి మరియు మునిసిపాలిటీల ఏర్పాటు నిమిత్తం (మునిసిపల్ కౌన్సిళ్ళు, మునిసిపల్ కార్పోరేషన్ లు) తెలంగాణా ప్రభుత్వం “తెలంగాణా మునిసిపాలిటీల చట్టం, 2019 (2019 లోని చట్టం (యాక్టు నెం.11) ని శాసనంగా రూపొందించింది.

లేఅవుట్లు, భవనాల ద్వారా స్థలం అభివృద్ధి నిమిత్తం కావల్సిన వివిధ అనుమతులు జారీ చేయడానికై దరఖాస్తులను వేగంగా పరిష్కరించేందుకు తెలంగాణా ప్రభుత్వం, తెలంగాణా మునిసిపల్ యాక్టు, 2019 కి అనుగుణంగా స్థలం యజమాని/డెవలపర్ ఇచ్చే స్వీయప్రమాణ పత్రం (సెల్ఫ్ సర్టిఫికేట్) పై ఆధారపడి ఉండే దానిని మరియు యూజర్ స్నేహపూర్వక వాతావరణం ఏర్పరచేందుకు గాను “టి.ఎస్ - బిపాస్” ని ఏర్పాటు చేయడం జరిగింది.

టి.ఎస్ – బిపాస్ ప్రధాన లక్షణాలు

  • ప్రతిపాదనలు పరిశీలించడానికి, ప్రతిపాదన తరువాతి సరి నిరూపణ (పోస్ట్ వెరిఫికేషన్) నిర్వహించి, అనధికార అభివృద్ధి పనులు/ ఉల్లంఘనలపై అమలు చర్య (ఎన్ ఫోర్సుమెంట్ యాక్షన్) చేపట్టడానికి, జిల్లా కలెక్టర్ అధ్వర్యంలో జిల్లా స్థాయి బిపాస్ కమీటి ఒకటి ఉంటుంది.
  • 75 చII గII వరకు ఉండే ప్లాట్ సైజ్ లకు అనుమతి ఏదీ అవసరం ఉండదు. అయితే దరఖాస్తుదారు “అన్ లైన్ లో రిజిస్టర్” చేయవలసి ఉంటుంది.
  • 500 చII మీII వరకూ ఉండే ప్లాట్ కి మరియు 10 మీ. ఎత్తు ఉండే భవనానికి దరఖాస్తుదారు ద్వారా, స్వీయ ప్రమాణీకరణ (సెల్ఫ్- సర్టిఫికేషన్) ఆధారంగా తక్షణ బిల్డింగ్ ఆమోదం.
  • 10 మీ. కన్నా ఎక్కువ ఎత్తు ఉండే అన్ని భవనాలకు ఏక గవాక్ష ఆమోదం (సింగిల్ విండో అప్రూవల్) మరియు అన్ని నివాసేతర బిల్డింగ్ అనుమతులను 21 రోII లోగా మంజూరు చేయబడతాయి.
  • 200 చII మీII విస్తీర్ణం మరియు 7 మీ. వరకు ఎత్తు ఉండే ప్లాట్లకు తనఖా ఉండదు.
  • జిల్లా స్థాయి కమీటి ద్వారా బిల్డింగ్ అనుమతుల అనంతర సరి నిరూపణ (పోస్ట్ వెరిఫికేషన్) జరుగుతుంది.
  • తప్పుడు సమాచారానికి, నిజాలు మరుగుపరచిన సందర్భంలోనూ దరఖాస్తుదారు శిక్షకు పాత్రుడౌతాడు.
  • ఉల్లంఘనలు జరిపితే, ఎలాంటి నోటీసు ఇవ్వకుండానే వాటిని తొలగించడం జరుగుతుంది.
  • స్వీయ ప్రమాణీకరణ (సెల్ఫ్- సర్టిఫికేషన్) ఆధారంగా అన్ లైన్ లో ఆక్యూపెన్సీ సర్టిఫికేట్ జారీ చేయబడుతుంది.

చర్యలు మరియు నియమాలు

మీ నియమాలను తెలుసుకోండి

ఉత్తమ లక్షణాలు

మా నాయకులు

తెలంగాణ రాష్ట్రం – బి పాస్ యొక్క ఆవిష్కరణ మరియు ప్రమోషన్ వెనుక ఉన్న గొప్ప మనసులు.

Get In Touch

Contact Us

Contact Info